గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, మార్చి 2018, సోమవారం

నరధర్మవృత్తము. రచన:-శ్రీ వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
నరధర్మవృత్తము. 
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
                                                                      జుత్తాడ.
నరధర్మవృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.భ.స.స.జ.భ.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నరులే!వానరులైలచొ?నరధర్మము!నిల్చు. నీతి!న్యాయము!కుదురు!ధరన్!
పరమార్ధంబునె!యెంతురు!పరపీడన!మృగ్యమౌను!బాయరు పరమునెదన్!
పరకష్టాలను!నిల్తురు!వరదంబులు!గాంతురెన్నొ?వ్రాయుదురిల!స్తుతులన్!
చరితార్ధంబగు!దేశము!సరిమార్గము!నెంతురెల్ల?సా యశులనగ! నిలన్!

"-సత్యయుగమున!ధర్మమునాల్గుపాదముల నడచెను.అదేసత్యము త్రేతా
యుగమున మూడుపాదములనిలచెను.ధర్మసంస్థాపనార్ధమైవిష్ణువు
రామావతారమెత్తవలసి వచ్చెను.నేటి నరులు వానరులైన!కలియుగము
త్రేతాయుగమగును.రామాయణమంతా!వానరులప్రతిభా!సంపత్తుల
వలననే!దనరెను.వానరులు సేవాభావము,నాటిధర్మరక్షణకునుపకరించి
యుగపురుషుడు!రామునికీర్తిభూమండలమున్నంతవరకు నిల్చునట్లు
జేసిరి.ప్రస్తుత"కలియుగము ధర్మమేకపాద!చరితము.అన్యాయము
అక్రమము,అవినీతి.అపకారచింతన,దైవదూషణ,విలయతాండవము,
చేయుచున్నది.ఇట్టిదినములలో!ఈమానవులకు వానరత్వచింతన,
కల్గిన!ధర్మసంస్థాపన గల్గి! త్రేతాయుగమనిపించుననుట!నిజము."-

1.గర్భగత"బుద్బుధ"-వృత్తము.
బృహతీఛందము.స.భ.భ.గణములు.వృ.సం.436.ప్రాసగలదు.
నరులలే!వానరు లైనచొ?
పరమార్ధంబునె!యెంతురు!
పరకష్టాలను!నిల్తురు!
చరితార్ధంబగు!దేశము!

2.గర్భగత"గతిమా"-వృత్తము.
బృహతీఛందము.స.స.జ.గణములు.వృ.సం.348.ప్రాసగలదు.
నర ధర్మము నిల్చు!నీతి!
పరపీడన!మృగ్యమౌను!
వరదంబులుగాాంతు రెన్నొ?
సరిమార్గము!నెంతు రెల్ల?

3.గర్భగత"-వాదిలు"-వృత్తము.
అన్ష్టుప్ఛందము.భ.న.లగ.గణములువృ.సం.127.ప్రాసగలదు.
న్యాయముకుదురరు ధరన్!
బాయరు పరము నెదన్!
వ్రాయుదు! రిల స్తుతులన్!
సా యశులనగ!  నిలన్!

4.గర్భగత"-సాయస"-వృత్తము.
ధృతిఛందము.స.భ.భ.స.స.జ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నరులే!వానరులైనచొ?నర ధర్మము! నిల్చు నీతి!
పరమార్ధంబును!యెంతురు!పరపీడన!మృగ్యమౌను!
పరకష్టాలను!నిల్తురు!వరదంబులు!గాంతు రెన్నొ?
చరితార్ధంబగు!దేశము!సరిమార్గమునెంతు!రెల్ల?

5.గర్భగత"-చేతక"-వృత్తము.
అయష్టీఛందము..స.స.జ.భ.న.లగ.గణములు యతి.10.వ.యక్షరము
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చు నీతి!న్యాయముకుదురు!ధరన్!
పరపీడన!మృగ్యమౌను!బాయరు!పరము!నెదన్?
వరదంబులు!గాంతురెన్నొ?వ్రాయుదురిల!స్తుతులన్!
సరిమార్గము!నెంతురెల్ల?సా యశులనగ? నిలన్!

6.గర్భగత"నీతిననిల్చు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.స.జ.భ.న.జ.య.జ.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చునీతి!న్యాయము!కుదురు!ధరం!నరులే!వానరులైనచొ?
పరపీడన!మృగ్యమౌనుబాయరు!పరము!నెదం!పరమార్ధంబును!యెంతురు!
వరదంబులు!గాంతురెన్నొ?వ్రాయుదురిల!స్తుతులం!పరకష్టాలను!నిల్తురు!
సరిమార్గము!నెంతురెల్ల?సాయశులనగ!నిలం?చరితార్ధంబగు!దేశము

7.గర్భగత"-జయాశయ"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.న.జ.య.స.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
న్యాయము!కుదురు!ధరం!నరులే!వానరులైనచొ?
బాయరు!పరము!నెదం?పరమార్ధంబును!యెంతురు?
వ్రాయుదురిల!స్తుతులం!పరకష్టాలం!నిల్తురు!
సాయశులనగ!నిలం!చరితార్ధంబగు!దేశము!

8.గర్భగత"-మృగ్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.న.జ.య.స.న.జ.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనీమముగలదు.
న్యాయము!కుదుర!ధరం!నరులే!వానరులైనచొ?నరధర్మము!నిల్చు నీతి!
బాయరు!పరము!నెదం?పరమార్ధంబును!యెంతురు?పరపీడన!మృగ్యమౌను!
వ్రాయుదురిల!స్తుతులం?పరకష్టాలను!నిల్తురు!వరదంబులు!గాంతురెన్నొ?
సా యశులనగ!నిలం?చరితంబగు!దేశము!సరిమార్గము నెంతురెల్ల?

9.గర్భగత"-నీమక"-వృత్తము 
ధృతిఛందము.స.స.జ.స.భ.భ.గణములు.యతి.10.వ.యక్షరము.
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చు!నీతి!నరులే!వానరులైనచొ?
పరపీడన!మృగ్యమౌను!పరమార్ధంబును!యెంతురు!.
వరదంబులు!గాంతురెన్నొ?పరకష్టాలను!నిల్తురు!
సరిమార్గము!నెంతు రెల్ల?చరితంబగు!దేశము!

10.గర్భగత"-వరదంబుల"-వృత్తము
.ఉత్కృతిఛందము.స.స.జ.స.భ.భ.భ.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనీమముగలదు.
నరధర్మము!నిల్చునీతి!నరులే!వానరులైనచొ?న్యాయము!కుదురు!ధరన్?
పరపీడన!మృగ్యమౌను!పరమార్ధంబును!యెంతురు!బాయరు!పరము!నెదన్?
వరదంబులు!గాంతురెన్నొ?పరకష్టాలను!నిల్తురు!వ్రాయుదురిల!స్తుతులన్?
సరిమార్గము!నెంతురెల్ల?చరితంబగు!దేశము!సా యశులనగ!నిలన్!

స్వస్తి.


.మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

pranaamamulu

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.