గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, డిసెంబర్ 2017, శనివారం

అష్టదళ పద్మ అష్ట దిగ్బంధచంపకము రచన, శ్రీ ఎమ్వీవీయస్ శాస్త్రి

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ ఎమ్వీవీయస్ శాస్త్రి కృత అష్టదళ పద్మ అష్ట దిగ్బంధచంపకము. చూడండి.  
అష్టదళ పద్మ అష్ట దిగ్బంధచంపకము 
వి ను ర ద యాం త రం గు డ వు వి న్న ప మొ క్క టి ప క్షి వా హ నా
వి ను తి ని జే సె దన్ వి ను ము వి క్రమ నం ద సు తా వ రా హ రీ
వి న య ము తో డ వే డి తి ని వి జ్ఞు ని జే య ర గో ప భూ వ రా
వి ను మ య నీ వె ది క్క ను చు వి న్న ప మం టి ర మా మ నో హ రా
స్వస్తి.
యమ్వీవీయస్ శాస్త్రి.
బంధ కవితాభిలాషులగు శ్రీ శాస్త్రిగారిని మనసారా అభినందిస్తున్నాను.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ శాస్త్రి గారి అష్ట దళ పద్మ , అష్ట దిగ్బంధ చంపకము అద్భుతము గానున్నది. అభినందన మందారములు. సోదరులు శ్రీ చింతా వారికి ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.