గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, నవంబర్ 2017, ఆదివారం

కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత పద్మ బంధ తేటగీతి.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కవయిత్రి పావులూరి సుప్రభ విరచిత పద్మ బంధ తేటగీతినవలోకించండీ.
షట్పత్ర పద్మ బంధము
తే.గీ
జేల నందింతు నీకిదే శ్రీమదంబ
చేరవచ్చి మన్నించిన చెల్మి నీది
హేలగాఁ బల్కి పల్కించు శీలమౌను
నిత్యమిత్తు జేలిట్టులె నీరజాక్షి
సుప్రభ
11-03-2017
 బంధ కవయిత్రి సుప్రభగారికి 
అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...


నమస్కారములు
సుప్రభ గారు ! " షట్పత్ర బంధము " అందమైన చిత్రము , అందుంచిన తేటగీతి పద్యము అద్భుతముగా నున్నది . అభినందన మందారములు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.