గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, అక్టోబర్ 2017, శుక్రవారం

చక్రబంధ సీసము. .. .. .. రచన. శ్రీ పూసపాటి కృష్ణకుమార్

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ పూసపాటి కృష్ణకుమార్ గారు వ్రాసిన చక్రబంధ సీసము అపురూపమైనది.
తప్పక గ్రహించఁ గలరని ఆశించుచున్నాను.
వదన పుస్తక మిత్రులకు నమస్కారములు నిన్న తిరుమలలో శ్రీవారి చక్ర స్నానము తో శ్రీవారి బ్రహ్మోత్సవములు ముగిశాయి . చక్ర బంధ సీసములో శ్రీవారి ప్రార్ధన నిన్న వ్రాశి శంకరాభరణము బ్లాగులో పెట్టాను. పరిశీలించగలరు
చక్ర బంధ సీసములో శ్రీ వేంకటేశ్వర స్వామీ ప్రార్ధన
సీ:శ్రీ లక్ష్మీ వల్లభ, శ్రీ గోపికాలోల , శ్రీ జగత్పాలాయ, శ్రీ నివాస
శ్రీ వేంకటేశాయ, శ్రీ అమృతాంశాయ, శ్రీ వత్సవక్షసే, శ్రీ హరాయ,
శ్రీ శాంజ్ఞ పాణయే ,శ్రీకటి హస్తాయ, శ్రీ పద్మనాభాయ, శ్రీధరాయ,
శ్రీ దీనబంధవే, శ్రీ అనేకాత్మనే, శ్రీ జగద్వాపినే, శ్రీ వరాయ,
శ్రీ హయ గ్రీవాయ, శ్రీ జగదీశ్వరా, శ్రీ పరంజ్యోతిషే, శ్రీ రమేష,
శ్రీ మధుసూధనా, శ్రీ భక్త వత్సలా, శ్రీ పరబ్రహ్మణే, శ్రీ శుభాంగ,
శ్రీ యజ్ఞ రూపాయ, శ్రీ ఖడ్గ ధారిణే, శ్రీ నిరాభాసాయ, శ్రీ గిరీశ,
శ్రీ వన మాలినే, శ్రీ యాదవేంద్రాయ, శ్రీ సుర పూజితా, శ్రీ శిరీశ,
తే: నంద నందనా, దశరధ నందన, మధు
సూధన, పశుపాలకుడ ,అనాధ రక్ష
కా , దినకర తేజా,సాలగ్రామ హర, పు
రాణ పురుష, కాపాడు పరమ దయాళు.
పద్యము చదువు విధానము : 1 అన్న చోటునుంచి “శ్రీ లక్ష్మీ వల్లభ” తో మొదలు పెట్టి మద్యలో ఉన్న శ్రీ తో కలిపి “ శ్రీ గోపికా లోల “అని చదువు కోవాలి చివరిగా
“శ్రీ శిరీష” తో ఆపి పైన “నంద నందనా” నుంచి చదువుకొని “పరమ దయాళు” వద్ద ముగించాలి

పూసపాటి కృష్ణ సూర్య కుమార్ (సెల్ 9290042432 )
నా వ్యాఖ్య. 
ఆర్యా! అభినందనలు.
అద్భుతమైన యత్నము, మహాద్భుతదైవ నివేదనంబులో
కాద్భుత చిత్ర పద్య శుభ హారము, మీ కవితామృతంబుగా
నుద్భవమౌనటుల్ హరి మహోజ్వలశక్తి యొనర్పఁ జేసె, కిం
చిద్భవమైన దోషములు శ్రీహరి కాచును పూసపాటియున్
నమస్తే.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.