గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, సెప్టెంబర్ 2017, శనివారం

శ్రీ రాజ రాజేశ్వరి, .. .. .. దండక గర్భ షోడశ పాద సీసము

1 comments

  జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులు మనము జగన్మాత కటాక్షము పొంది కృతార్థులమైనాము.
మీ అందరికీ నా అభినందనలు.
రాజ రాజేశ్వరి
శ్లో||  ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాం 
శంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |
సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీం
ధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ||
షోడశ కళాపూర్ణ నవదుర్గా స్వరూపిణియైన 
శ్రీ రాజరాజేశ్వరీ జగన్మాత కృపామృతాస్వాదనాసక్తుఁడనైన నాచే విరచింపఁ జేసిన 
దండక గర్భ షోడశ పాద సీసము
శ్రీరాజ రాజేశ్వరీ సర్వ లోకేశ్వ రీ! శాశ్వితానంద! రీతినొసగు.
శ్రీ శైలపుత్రీ! ప్రసీద ప్రసీద ప్రభారాశివోయమ్మ భాతినిమ్ము.
నే బ్రహ్మసచ్చారిణీ కొల్తు నిన్నే సుధారాశివేనీవు. దయను కనుమ.
హే చంద్రఘంటా మహేశానివమ్మా! కృపన్ గాంచుమోయమ్మ. భక్తిఁ గొలుతు.
కూష్మాండమాతా! నిగూఢాంతరంగప్రకాశంబు వీవేను. కరుణఁ జూపు.
మాస్కందమాతా ప్రమత్తుండ నన్ జూచి కాపాడు మాతల్లి కనకవల్లి.
కాత్యాయినీ భవ్య కామేశ్వరీ నీదు కారుణ్యమేనెన్న గలనొ? చెపుమ.
ఓకాళరాత్రీ మహోన్మత్తకాశీమహారాజ్ఞివీవేను యజ్ఞ దగ్ధ!
శ్రీమన్మహాగౌరి చైతన్యమున్ గొల్పి చిత్తమ్మునన్నిల్చు చిత్ప్రభాస!
సిద్ధిదాత్రీ పయోరాశివీవే మహద్దక్షసత్పుత్రి హారతిఁ గొను.
ఈశానివీవేవశింపన్ హృదిన్ మమ్ము రక్షించుచుండంగ ప్రకృతమైన
ప్రాణంబుపై ప్రీతి ప్రాణంబుపై భీతి మాకేలనోయమ్మ! మాకు నీవె
శ్రీకాంతులన్ గొల్పి చేకొంచు మమ్మున్ మహత్కార్యముల్ ప్రీతి నసదృశముగ
చేయింతువమ్మా! విశేషంబుగా నిత్య కల్యాణివీవేను కనకదుర్గ!
నిత్యంబు మాయందు స్తుత్యంబుగానిల్చి కాపాడు మాయమ్మ కల్పవల్లి.
ధాత్రిన్ గృపన్ జూడు తల్లీ! నమస్తే న మస్తేనమస్తేనమఃప్రభాస!
తే.గీ. హారతిగొనుమమ్మా! ధీసుధార్ణవ! ప్రియ
హారతిగొనుమమ్మా! జనహారతిగొనుమ!
దోషపరిహారిణీ శుభపోష జనని.
వందనంబులు. నిలుము మా డెందములను.
సీస గర్భ షోడశ పాద దండకము
శ్రీరాజ రాజేశ్వరీ సర్వ లోకేశ్వ రీ! శాశ్వితానంద!
శ్రీ శైలపుత్రీ! ప్రసీద ప్రసీద ప్రభారాశివోయమ్మ
నే బ్రహ్మసచ్చారిణీ కొల్తు నిన్నే సుధారాశివేనీవు.
హే చంద్రఘంటా మహేశానివమ్మా! కృపన్ గాంచుమోయమ్మ.
కూష్మాండమాతా! నిగూఢాంతరంగప్రకాశంబు వీవేను.
మాస్కందమాతా ప్రమత్తుండ నన్ జూచి కాపాడు మాతల్లి
కాత్యాయినీ భవ్య కామేశ్వరీ నీదు కారుణ్యమేనెన్న
ఓకాళరాత్రీ మహోన్మత్తకాశీమహారాజ్ఞివీవేను
శ్రీమన్మహాగౌరి చైతన్యమున్ గొల్పి చిత్తమ్మునన్నిల్చు
సిద్ధిదాత్రీ పయోరాశివీవే మహద్దక్షసత్పుత్రి
ఈశానివీవేవశింపన్ హృదిన్ మమ్ము రక్షించుచుండంగ
ప్రాణంబుపై ప్రీతి ప్రాణంబుపై భీతి మాకేలనోయమ్మ
శ్రీకాంతులన్ గొల్పి చేకొంచు మమ్మున్ మహత్కార్యముల్ ప్రీతి
చేయింతువమ్మా! విశేషంబుగా నిత్య కల్యాణివీవేను
నిత్యంబు మాయందు స్తుత్యంబుగానిల్చి కాపాడు మాయమ్మ
ధాత్రిన్ గృపన్ జూడు తల్లీ! నమస్తే న మస్తేనమస్తేనమః!

నైవేద్యం : పాయసాన్నంము.
జైహింద్.

29, సెప్టెంబర్ 2017, శుక్రవారం

సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) రూపమున మనలను మన అమ్మ కరుణింపనున్నది.
సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లిగనుక సిద్ధి దాత్రి. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను దేవి కృపవలనే పొందెనని దేవీపురాణమున పేర్కొనబడింది. ఈమె పరమశివునిపై దయదలచి, ఆయన శరీరమున అర్ధబాగమై నిలచెను. సిద్ధిధాత్రీదేవి చతుర్భుజ, సింహవాహన. ఈమె కమలముపై ఆసీనురాలై యుండును. ఈమె కుడివైపున ఒకచేతిలో చక్రమును, మఱొకచేతిలో గదను ధరించును. ఎడమవైపున ఒక కరమున శంఖమును, మఱియొక హస్తమున కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించువారికి సకలసిద్ధులును కరతలామలకము.

ఈమె కృపచే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారమార్ధిక మనోరథములన్నియును సఫలములగును. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన భక్తునకు కోరికలెవ్వియును మిగిలియుండవు. అట్టివానికి భగవతీదేవి చరణ సన్నిధియే సర్వస్వమగును. భగవతీమాత యొక్క స్మరణ ధ్యాన పూజాదికముల ప్రభావము వలన ఈ సంసారము నిస్సారమని బోధ పడును. తన్మహత్వమున నిజమైన, పరమానందదాయకమైన అమృతపదము ప్రాప్తించును.
మీకు సర్వశ్రేయములను ఈ అమ్మ చేకూర్చునుగాక.
సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని )
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
మాలినీ వృత్తము గర్భ సీసము. (మాలిని వృత్తము. - న న మ య య .. యతి 9)
వినయ మొసగెదవీవే నాకిలన్ సిద్ధి దాత్రీ! పరాత్పరి దారి నీవె.
విజయ విభవములీవే సత్య సంపూర్ణ తేజా! మదిన్ నిల్పి పూజ సేతు.
సదయ నిలుము మనోజ్ఞా! దర్ప సన్మూల నాశా! మహేశాని! నాదు మదిని.
విలయ మగునెడ నీవే రక్ష నాకున్. మ దంబా! నిరంజనా! హరుని రాణి.
తే.గీ. కార్య సిద్ధిని కలిగించు  కామితప్రద!
సౌర్య సద్గుణ సంపద్విశారదులుగ
సజ్జనంబులఁ గాచుచు సదయఁ గనుమ!
వందనంబులునీకునానందపూర్ణ!
సీస గర్భస్థ మాలినీ వృత్తము . (న న మ య య .. యతి 9)
నయ మొసగెదవీవే నాకిలన్ సిద్ధి దాత్రీ
జయ విభవములీవే సత్య సంపూర్ణ తేజా!! .
దయ నిలుము మనోజ్ఞా! దర్ప సన్మూల నాశా
లయ మగునెడ నీవే రక్ష నాకున్. మ దంబా!
నైవేద్యం : పాయసాన్నము.
జైహింద్.

28, సెప్టెంబర్ 2017, గురువారం

మహాగౌరి( దుర్గ ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! ఈరోజు మన అమ్మ మహాగౌరిగా మనలను కరుణించుచున్నది.
అష్టవర్షా భవేద్గౌరీ - "మహాగౌరి" అష్టవర్ష ప్రాయము గలది. ఈమె గౌర వర్ణ శోభలు మల్లెపూవులను, శంఖమును, చంద్రుని తలపింపజేయును.ఈమె ధరించు వస్త్రములును, ఆభరణములును ధవళ కాంతులను వెదజల్లుచుండును. ఈమె చతుర్భుజ, వృషభవాహన. తన కుడిచేతులలో ఒకదానియందు అభయముద్రను, మఱియొకదానియందు త్రిశూలమును వహించియుండును. అట్లే ఎడమచేతులలో ఒకదానియందు డమరుకమును, వేఱొకదానియందు వరముద్రను కలిగియుండును. ఈమె దర్శనము ప్రశాంతము.

పార్వతి యవతారమున పరమశివుని పతిగా పొందుటకు కఠోరమైన తపస్సు చేయగా ఈమె శరీరము పూర్తిగా నలుపెక్కెను. ప్రసన్నుడైన శివుడు గంగాజలముతో అభిషేకించగా ఈమె శ్వేత వర్ణశోభితయై విద్యుత్కాంతులను విరజిమ్ముచు "మహాగౌరి" యని వాసిగాంచెను. ఈమె శక్తి అమోఘము. సద్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషములన్నియును ప్రక్షాళితమగును. వారి పూర్వ సంచిత పాపములును పూర్తిగా నశించును. భవిష్యత్తులో గూడ పాపతాపములుగాని, దైన్య దుఃఖములుగాని వారిని దరిజేరవు. వారు సర్వవిధముల పునీతులై, ఆక్షయముగా పుణ్యఫలములను పొందుదురు. ఈ దేవి పాదారవిందములను సేవించుటవలన కష్టములు మటుమాయమగును. ఈమె యుపాసన ప్రభావమున అసంభవములైన కార్యముల సైతము సంభవములే యగును.
ఈ తల్లి ఆశీస్సులు మీకు లభించుగాక.
మహాగౌరి( దుర్గ )
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
నిశావృత్త గర్భ సీసము ( నిశావృత్తము న న ర ర ర ర .. యతి 9 )
సతి! కృపను గనుమ శాంభవీ! తల్లి! మా శ్రీమహాగౌరివై! చేదుకొనుము.
ఇక తపము జపములేల తల్లీల వమ్మౌనె నిన్ గాంచినన్. జ్ఞాన తేజ!
నిలు. నెపము వలదు నేను నిన్నే మదిన్ నిల్పి ధ్యానించెదన్. నేర్పు మీర.
ఇట ప్రపగ దొరికితీవ, భారంబు నీదే. జగద్రక్షిణీ! దివ్య తేజ!
తే.గీ. ఘన నిశా వృత్త గర్భస్థ గణ్య సీస
వినుత శ్రీమహా గౌరీ! వివేకమిమ్ము.
శారదానవరాత్రుల చలువనెపుడు
మమ్ము కాంచుచు రక్షించుమమ్మ! దేవి!
సీస గర్భస్థ నిశావృత్తము .( న న ర ర ర ర .. యతి 9 )
కృపను గనుమ శాంభవీ! తల్లి! మా శ్రీమహాగౌరివై!
తపము జపములేల తల్లీల వమ్మౌనె నిన్ గాంచినన్.
నెపము వలదు నేను నిన్నే మదిన్ నిల్పి ధ్యానించెదన్.
ప్రపగ దొరికితీవ, భారంబు నీదే. జగద్రక్షిణీ! దివ్య తేజ!
నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం)
జైహింద్.

27, సెప్టెంబర్ 2017, బుధవారం

సరస్వతీ పూజా క్రమము.

1 comments

జైశ్రీరామ్.

సరస్వతీం చతాం నౌమి వాగధిష్ఠాతృ దేవతాం
దేవత్వం ప్రతిపద్యంతే యదనుగ్రహతో జనా:
(అర్థం- వక్కుకు అధిష్ఠాన దేవత అయిన సరస్వతీ మాతా !, నీ అనుగ్రహం పొందిన వారు దైవత్వం కూడా పొందగలుగుతున్నారు)

ఆచమనం
ఓం కేశవాయ స్వాహ
నారాయణాయ స్వాహ
మాధవాయ స్వాహ
గోవిందాయ నమః
విష్ణవే నమః
మధుసూదనాయ నమః
త్రివిక్రమాయ నమః
వామనాయ నమః
శ్రీధరాయ నమః
హృషీ కేశాయ నమః
పద్మనాభాయ నమః
దామోదరాయ నమః
సంకర్షణాయ నమః
వాసుదేవాయ నమః
ప్రద్యుమ్నాయ నమః
అనిరుద్దాయ నమః
పురుషోత్తమాయ నమః
అదోక్షజాయ నమః
నారసింహాయ నమః
అచ్యుతాయ నమః
జనార్ధనాయ నమః
ఉపేన్ద్రాయ నమః
హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః
శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః     ( అని కొంచెం నీళ్ళు పళ్ళెములో విడువవలెను)


ఆచమానంతరం భూశుద్ధి మంత్రము
భూశుద్ధి కై భూతోచ్చాటన మంత్రము (చదువుతూ)
మం|| ఉత్తిష్టంతు భూతపిశాచా| యేతే భూమి భారకాః
ఏతే షా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే    || - కొన్ని అక్షతలు - వాసన చూచి -వెనుకకు వేసుకోవలెను.

ప్రాణాయామము.
ఓం భూ : ఓం భువః ఓగ్ ఒ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగ్ ఒ సత్యం ఓం తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్  ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువ స్సువరోమ్ - అను మంత్రమును నుచ్చరించుచు ప్రాణాయామము చేయవలెను.
సంకల్పము చెప్పుకొనవలెను.
సంకల్పం:-    
అధ్య బ్రహ్మణః ద్వితీయ పరార్దే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరో ర్దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య ......ప్రదేశే కృష్ణా గోదావర్యో ర్మధ్య దేశే శోభన గృహే- సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానస్య వ్యావ హారిక చాంద్ర మానేన ......సంవత్సరే ....ఆయనే ఋతౌ...... మాశే ...... పక్షే ......తిదౌ .......వాసరే ......శుభ నక్షత్రే శుభ యోగే శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిదౌ శ్రీ మాన్ ........గోత్రః ..... నామధేయః శ్రీ మతః గోత్రోద్భవస్య......నామ దేయస్య ధర్మ పత్నీ సమేతస్య  ( స్త్రీ లైనచో ఆయా స్థలములో " శ్రీమతి: ........ గోత్రవతీ: .......... నామధేయవతీ,  శ్రీమత్యాః, గోత్రవత్యాః నామధేయవత్యాః " అని చెప్పు కోవలెను)  మమ ధర్మార్ధ కామ మోక్ష చరుర్విధ ఫల పురుషార్ధ  సిద్ధ్యర్ధం......... సకల విద్యాపారంగత్త్వ సిద్ధ్యర్ధం ..... శ్రీ సరస్వతీ దేవీ ముద్దిశ్య శ్రీసరస్వతీ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త ప్రకారేణ యావశ్చక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే ........
         
కలశపూజ
కలశమును గంధ పుష్పాలతో అర్పించి, కలశంలో వాటిని వేసి కలశముపై చేయి ఉంచి  - " ఆపోవా ఇదగ్౦ సర్వం, విస్వభూతాన్యాపః, ప్రాణాషఆపః, పశవః, ఆపః, అన్నమాపో అమృతమాపో సమ్రాడాపో, విరాడాపో, స్వరాజాపశ్చంధాగ్౦ ష్యాపో జ్యోతిగ్౦ ష్యాపో యజూగ్ ష్యా పస్స ర్వా ఇహ దేవతానాపో భూర్భువస్సువ రోమ్"
శ్లో || గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే
        సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు ,ఆయాంతు
        ......దేవ పూజార్ధం మమ దురితక్షయ కారకాః కలశో
        దకేన పూజా ద్రవ్యాణి, దేవీం ఆత్మానంచ సంప్రోక్ష్య
అనుచు సమస్త నదీ తీర్థాలను సంభావిస్తూ కలశోదకం శ్రీసరస్వతీమాత పటము పైన తదితర పూజా ద్రవ్యాల పైన పవిత్రమగుటకు సంప్రోక్షించ (చల్ల) వలెను. పిదప ఓం - ఐం - హ్రీం - వద శ్రీసరస్వతీ  దేవతా స్థిరాభవతు - సుప్రసన్నా భవతు ' వరదాభవతు - అని చెప్పుకొని - దీపమును వెలిగించి  -

తరువాత
పసుపు గణపతి పూజ చేయవలెను.
" ఓం - తత్పురుషాయ విద్మహే - వక్రతుండాయ ధీమహి తన్నోందంతీ ప్రచోదయాత్ "
అనుచు పసుపు గణపతిని అభి మంత్రించి - క్రింది నామాష్టకములతో లఘు పూజ చేయవలెను.

నామష్టకం
ఓం అఖిలేశ్వరాయ నమః - అక్షతలు
ఓం అఖువాహనాయ నమః - పువ్వులు
ఓం ఇభవక్త్రాయ నమః - పసుపు
ఓం ఈశ పుత్రాయ నమః - కుంకుమ
ఓం ఉమా పుత్రాయ నమః పన్నీరు
ఓం ఊహాతీతాయ నమః గంధం
ఓం ఏకదంతాయ నమః  అక్షతలు
ఓం కుమారగురవే నమః  పువ్వులు
శ్రీ మహాగణాధిపతయే - సర్వసిద్ది ప్రదాయ నమః - అని పుష్పములతో కాని, తమలపాకుతో గాని - ఒక్క చుక్క నీరు చల్లి -

నమస్కారమంత్రం
వాగీశాద్యా స్సుమనస స్సర్వార్ధానా ముపక్రమే
యం న త్వా కృత కృత్యాః స్యు: - తం నమామి గజాననం
అను మంత్రము చదువుచూ - పసుపు గణపతి ముందు తాంబూలము నుంచి నమస్కరించవలెను
ప్రార్థన నమస్కారము పిదప ఆ పూజా ఫలమును పరమేశ్వరార్పనమస్తు అంటూ ధారపోసి
మరల ప్రాణాయామము సంకల్పము చెప్పుకొని సరస్వతీ పూజ ప్రారంభించవలెను.
సరస్వతీ స్మరణం
శ్లో|| నారాయణం నమస్కృత్య - నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీం చైవ - తతో జయము దీలయేత్
అని స్మరించి - సంకల్పము చెప్పుకోవలెను.

ధ్యానం
శ్లో|| పుస్తకేతు యతోదేవీ క్రీడతే పరమార్ధతః
త త స్తత్ర ప్రకుర్వీత ధ్యాన మావాహనాదికమ్ ||
ధ్యాన మేవం ప్రకుర్వీత సాధకో విజితేంద్రి  యః
ప్రణవాసన మారూడం తదర్ధ త్వేన నిశ్చితాం   ||

శ్లో|| అంకుశం చాక్ష సూత్రంచ  పాశం వీణాంచ ధారిణీం
ముక్తాహార సమాయుక్తాం మొదరూపం మనోహరామ్
కృతేన దర్పణాఖ్యేన వస్త్రే ణో పరిభూషితాం
సుస్తనీం వేదవేద్యాం చ చంద్రార్ధ కృతశేఖరాం
జటాకలాప సముక్తాం పూర్ణ చంద్ర నిభాననాం


త్రిలోచనాం మహాదేవీం స్వర్ణ నూపుర ధారిణీం
కటకై స్స్వర్ణ రత్నాద్యై ర్ముక్తా వలయ భూషితాం
కంబుకంటీం సుతామ్రోష్టీం సర్వాభరణ భూషితాం
కేయూరై ర్మేఖలా ద్యైశ్చ ద్యో తయంతీం జగత్త్ర యం
శబ్ద బ్రహ్మత్మికాం దేవీం ధ్యానకర్మ సమాహితః       ||
(ఓం ఐం సరస్వత్యై నమః - ధ్యాయామి - ధ్యానం సమర్పయామి: ఆవాహనం

ఆవాహనం
శ్లో|| అత్రాగచ్చా జగద్వంద్యే సర్వలోకైక పూజితే
మయా కృతా మిమాం పూజాం గృహాణ జగదీశ్వరీం
(ఓం ఐం సర్వాభరణ భూషితాయై నమః ఆవాహనం సమర్పయామి ----- అమ్మవారిపై ----- అక్షతలు వేయవలెను )

ఆసనం:
శ్లో|| అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం
ముక్తా మణ్యంచితం చారు సింహాసనం దదామ్యహం ||
(ఓం ఐం జగదీశ్వర్యై నమః ..... సింహాసనం సమర్పయామి ..... అమ్మవారి పాదములపై పుష్పమును ఉంచవలెను.)

పాద్యం
శ్లో|| గంధ పుష్పాక్ష తై స్సార్ధం శుద్ధ తోయేన సంయుతం
శుద్ధ స్పటిక తుల్యాంగీ పాద్యం తే ప్రతిగృహ్యతాం   ||
(ఓం ఐం స్పాటికాభాయై నమః, పాద్యం సమర్పయామి ...... ఒక తమలపాకుతో జలమును సరస్వతిపై జల్లవలెను)

అర్ఘ్యం
శ్లో|| భక్తాభీష్ట ప్రదే దేవీ దేవదేవాది వందితే
ధాత్రుప్రియే జగద్ధాత్రీ దదామ్య ర్ఘ్యం గృహాణమే   ||
(ఓం ఐం ధాత్రుప్రియాయై నమః అర్ఘ్యం సమర్పయామి ...... కొంచెం నీరు చేతిలోపోసుకొని పళ్ళెములో విడువవలెను.)


ఆచమనీయం
శ్లో|| పూర్ణ చంద్ర సమానాస్యౌ కోటి సూర్య సమప్రభే
భక్త్యాం సమర్పితం వాణీ, గృహాణాచ మనీయకం  ||
(ఓం ఐం వాగీశై నమః - ఆచమనం దదామి ...... తమలపాకుతో గాని పువ్వుతో గాని కొంచెం నీరు చిలకవలెను.)

మధుపర్కం
శ్లో|| దధీక్షీర మధుఘ్రుత యుక్తం క్షీర రంభాఫలాడ్యం
సురుచిర మధుపర్కం గృహ్యాతాం దేవవంద్యే    ||
(ఓం ఐం భక్తా భీష్ట దాయిన్యై నమః మధుపర్కం గాని లేనిచో అక్షతలు గాని సమర్పించ వలెను.)

పంచామృతం
శ్లో|| దధిక్షీర ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం స్వీకురుష్వ మహేశ్వరీ    ||
(ఓం ఐం మహేశ్వర్యై నమః పంచామృత స్నానం సమర్పయామి ...... ఒక పువ్వుతో పంచామృతమును చల్లవలెను.

స్నానం
శ్లో|| శుద్దోదకైశ్చ సుస్నానం కర్తవ్యం విధి పూర్వకం
సువర్ణ కలశానీతైర్నానా గంధ సువాసితై:   ||
ఓం ఐం సువర్ణ కవచాయై నమః శుద్దోదక స్నానం సమర్పయామి...... పువ్వుతో నీరు చిలుకరించవలెను .

వస్త్రం
శ్లో|| శుక్ల వస్త్ర ద్వయం దేవీ కోమలం కుటిలాలకే
మయి ప్రీత్యాత్వయా వాణీ బ్రహ్మాణీ ప్రతిగ్రుహ్యతాం    ||
ఓం ఐం బ్రహ్మణ్యై నమః వస్త్ర యుగ్మం సమర్పయామి ....... శక్తి యుంటే వస్త్రము లేకుంటే అక్షతలు సమర్పించాలి.

యజ్ఞోపవీతం
శ్లో|| శబ్ద బ్రహ్మత్మికే దేవీ - శబ్ద శాస్త్ర కృతాలయే
బ్రహ్మ సూత్రం గృహాణత్వం బ్రహ్మ శక్రాది పూజితే
ఓం ఐం బ్రహ్మ శక్రాది పూజితాయై నమః యజ్ఞోపవీతం సమర్పయామి....... యజ్ఞోపవీతం లేదా అక్షతలు వేయవలెను.


ఆభరణం
శ్లో|| కటక మకుటహారై ర్నూపురై రంగదాద్యైనః
ర్వివిధ సుమణి యుక్త్యై ర్మేఖలా రత్న హారై:
కమలదళ విలాసే కామదేవం గృహీత్వా
ప్రకటిత కరుణార్ధ్రే భూషితే భూషణాని ||
ఓం ఐం కమలదళ విలాసిన్యై నమః సర్వాభరణాని  సమర్పయామి ....... అక్షతలు వేయవలెను.

గంధం
శ్లో|| చందనాగరు కస్తూరీ కర్పూరైద్యాది సంయుతం
గంధం గృహాణ వరదే దేవీ విధి పత్నీ నమోస్తుతే
ఓం ఐం విధిపత్నై నమః గంధం సమర్పయామి ...... గంధం చిలకరించవలెను.

అక్షతలు
శ్లో|| అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్వితాన్
గృహాణ వరదేదేవీ బ్రహ్మ పత్నీ శుభాత్మకాన్    ||
ఓం ఐం గీర్వాణ్యై నమః అక్షతాన్ సమర్పయామి...... అక్షతలు వేయవలెను.

పుష్పం
శ్లో|| మందారాది సుపుష్పైశ్చ తత్కాల తరు సంభవై:
కరివీరైర్మనోరమ్యై ర్వకులై : కేతకై శ్శుభై:
పున్నాగై ర్జాతికుసుమై ర్మందారైశ్చ సుశోభితై:
నీలోత్పలై : శుభై శ్చాన్యై స్తత్కాల తారు సంభవై:
కల్పితాని చ మాల్యాని గృహాణా మర వందితే
ఓం ఐం బ్రహ్మణ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి శక్తి యుంటే వస్త్రము లేకుంటే అక్షతలు సమర్పించాలి.

అథాంగ పూజ
(పసుపు, కుంకుమ, అక్షతలు, పూవులు చేతబట్టి సరస్వతిని స్మరిస్తూ ఆమె సర్వావయములను పూజించాలి)
ఓం బ్రహ్మాణ్యై  నమః పాదౌ పూజయామి
ఓం బ్రాహ్మణ మూర్తయే నమః గుల్పౌ పూజయామి
ఓం జగత్స్వరూపిణ్యై  నమః  జంఘౌ పూజయామి


ఓం జగదాద్యాయై నమః జానునీ పూజయామి
ఓం చారువిలాసిన్యై నమః ఊరూ పూజయామి
ఓం కమలభూమయే నమః కటిం పూజయామి
ఓం జన్మహీనాయై నమః జఘనం పూజయామి
ఓం గంభీరనాభయే నమః నాభిం పూజయామి
ఓం హరి పూజ్యాయై నమః ఉదరం పూజయామి
ఓం లోకమాత్రే నమః స్తన్యౌ పూజయామి
ఓం విశాలవక్షసే నమః వక్షస్థలం పూజయామి
ఓం గానవిచక్షణాయై నమః కంటం పూజయామి
ఓం స్కందప్ర పూజ్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం ఘనబాహవే నమః బాహూ పూజయామి
ఓం పుస్తక ధారిణ్యై నమః హస్తౌ పూజయామి
ఓం శ్రోత్రియ బంధవే నమః శ్రోత్రే పూజయామి
ఓం వేద స్వరూపాయై నమః వక్త్రం పూజయామి
ఓం సువాసిన్యై నమః నాసికాం పూజయామి
ఓం బింబా సమానోష్ట్యై నమః ఓష్టాం పూజయామి
ఓం కమలచక్షుషే నమః నేత్రే పూజయామి
ఓం తిలదారిణ్యై నమః ఫాలం పూజయామి
ఓం చంద్రమూర్తయే నమః చికురాన్ పూజయామి
ఓం సర్వప్రదాయై నమః ముఖం పూజయామి
ఓం శ్రీసరస్వత్యై నమః శిరః పూజయామి  
ఓం బ్రహ్మరూపిణ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి
(ఆ పిదప క్రింద ఇవ్వబడిన అష్టోత్తర శతనామములు గాని సహస్రనామములు గాని చదువుచూ యథాశక్తి  పూజించవలెను.


ఓం సరస్వ తైయ్య నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహమాయాయై నమః


ఓం వర ప్రదాయై నమః
ఓం పద్మనిలయాయై నమః
ఓం పద్మా క్ష్రైయ నమః
ఓం పద్మవక్త్రాయై నమః
ఓం శివానుజాయై నమః
ఓం పుస్త కధ్రతే  నమః
ఓం జ్ఞాన సముద్రాయై నమః ||10 ||
ఓం రమాయై నమః
ఓం పరాయై నమః
ఓం కామర రూపాయై నమః
ఓం  మహా విద్యాయై నమః
ఓం మహాపాత కనాశిన్యై నమః
ఓం మహాశ్రయాయై నమః
ఓం మాలిన్యై  నమః
ఓం మహాభోగాయై నమః
ఓం మహాభుజాయై నమః
ఓం మహాభాగ్యాయై నమః || 20 ||
ఓం మహొత్సాహాయై నమః
ఓం దివ్యాంగాయై నమః
ఓం సురవందితాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాపాశాయై నమః
ఓం మహాకారాయై నమః
ఓం మహాంకుశాయై నమః

ఓం సీతాయై నమః
ఓం విమలా యై నమః


ఓం విశ్వాయై నమః || 30 ||
ఓం విద్యున్మాలాయై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం చంద్రికాయ్యై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్ర లేఖావిభూషితాయై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సురసాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం దివ్యాలంకార భూషితాయై నమః
ఓం వాగ్దేవ్యై నమః || 40 ||
ఓం వసుధాయ్యై  నమః
ఓం తీవ్రాయై నమః
ఓం మహాభద్రాయై నమః
ఓం మహా బలాయై నమః
ఓం భోగదాయై నమః
ఓం  భారత్యై నమః
ఓం భామాయై నమః
ఓం గోవిందాయై నమః
ఓం గోమత్యై నమః
ఓం శివాయై నమః
ఓం జటిలాయై నమః
ఓం వింధ్యవాసాయై నమః
ఓం వింధ్యాచల విరాజితాయై నమః
ఓం చండి కాయై నమః
ఓం వైష్ణవ్యై నమః

ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మజ్ఞా నైకసాధ నాయై నమః
ఓం సౌదామాన్యై నమః
ఓం సుధా మూర్త్యై నమః
ఓం సుభద్రాయై నమః || 60 ||
ఓం సుర పూజితాయై నమః
ఓం సువాసిన్యై నమః
ఓం సునాసాయై నమః
ఓం వినిద్రాయై నమః
ఓం పద్మలోచనాయై నమః
ఓం విద్యా రూపాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం బ్రహ్మాజాయాయై నమః
ఓం మహా ఫలాయై నమః
ఓం త్రయీమూర్త్యై నమః || 70 ||
ఓం త్రికాలజ్ఞాయే నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం శాస్త్ర రూపిణ్యై నమః
ఓం శుంభా సురప్రమదిన్యై నమః
ఓం శుభదాయై నమః
ఓం సర్వాత్మికాయై నమః
ఓం రక్త బీజనిహంత్ర్యై నమః
ఓం చాముండాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం మాన్ణాకాయ ప్రహరణాయై నమః || 80 ||
ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః

ఓం సర్వదే వస్తుతాయై నమః
ఓం సౌమ్యాయై నమః
ఓం సురా సుర నమస్క్రతాయై నమః
ఓం కాళ రాత్ర్యై నమః
ఓం కలాధారాయై నమః
ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వారాహ్యై నమః || 90 ||
ఓం వారి జాసనాయై నమః
ఓం చిత్రాంబరాయై నమః
ఓం చిత్ర గంధా యై నమః
ఓం చిత్ర మాల్య విభూషితాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామప్రదాయై నమః
ఓం వంద్యాయై నమః
ఓం విద్యాధర సుపూజితాయై నమః
ఓం శ్వేతాననాయై నమః
ఓం నీలభుజాయై నమః || 100 ||
ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
ఓం చతురానన సామ్రాజ్యై నమః
ఓం రక్త మధ్యాయై నమః
ఓం నిరంజనాయై నమః
ఓం హంసాసనాయై నమః
ఓం నీలంజంఘాయై నమః
ఓం శ్రీ ప్రదాయై నమః

ఓం బ్రహ్మవిష్ణు శివాత్మి కాయై నమః || 108 ||

            సరస్వత్యష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి.
ధూపం
శ్లో|| దంశాంగం గగ్గులోపేతం సుగంధం సుమనోహరం
ధూపం గృహాణ కళ్యాణీ భక్తిత్వం ప్రదిగ్రుహ్య తాం
ఓం ఐం విశ్వాయై నమః ధూపమాఘ్రాపయామి
అగరువత్తులుగాని సాంబ్రాణి కడ్డీలు గాని వెలిగించి తొలిధూపం అమ్మవారికి చూపాలి.

దీపం
శ్లో|| ఘ్రుతవర్తి సమాయుక్తం దీపితం దీపమంబికే
గృహాణ చిత్ స్వరూపిత్వం కమలాసన వల్లభే ||
ఓం ఐం కమలాసన వల్లాభాయై నమః దీపం దర్శయామి ..... దీపం వెలిగించి నమస్కరించాలి.

నైవేద్యం
అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టో పపాచితాన్
మృదులాన్ గుడ సమ్మిశ్రాన్ సజీరక మరీచికాన్
కదళీ పన సామ్రాణిచ పక్వాని సు ఫలాని చ
కందమూల వ్యంజనాని సో పదంశం మనోహరం
అన్నం చతుర్విదోపేతం క్షీరాన్నం చ ఘ్రుతం దధి
శీతోదకంచ సుస్వాదు స్సు కర్పూరై రధి వాసితం
భక్ష్యభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం

ఓం ఐం సరస్వత్యై నమః మహానైవేద్యం సమర్పయామి - అని నివేదన పదార్ధములపై నీరు చిలుకుచూ - ఓం భూర్భువస్సువః తత్స వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి - ధీయోయోనః ప్రచోదయాత్ | ఓం స్వత్యంత్వర్తేన పరిషంచామి. అమృతమస్తు. అమ్రుతోపస్తర ణమసి


ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి - ఉత్తరాపోశనం సమర్పయామి - హస్తౌ ప్రక్షాళ యామి - పాదౌ ప్రక్షాలయామి శుద్దాచమనీయం  సమర్పయామి.

తాంబూలం
శ్లో|| తాంబూలం చ స కర్పూరం పూగనాగ దళైర్యుతం
గృహాణ దేవదేవేశ తత్వ రూపీ నమోస్తుతే   ||
ఓం ఐం దేవదేవేశిత త్వరూపిణ్యై నమః తాంబూలం సమర్పయామి

నీరాజనం
నీరాజనం గృహాణత్వం జగదానంద దాయినీ
జగత్తిమిర మార్తాండ మండలే తే నమోనమః
ఓం జగత్తిమిర మార్తాండ మండలాయై నమః నీరాజనం సమర్పయామి --- అని కర్పూర నీరాజనం వెలిగించి ఒక్క చిన్న తమలపాకుతో నీరు జల్లి చూపవలెను.

మంత్రపుష్పం
జాతవేదసే సునవామసో మమరాతీ యతో విదహాతి వేదః
నమః పర్ణాతి దుర్గాణి విశ్వా నా వేవ సిన్ధుందురి తా త్యగ్ని:
తామగ్ని వర్ణాంత పసాజ్వలన్తీం వైరోచ నీం కర్మలే షుజుష్టామ్
దుర్గాం దేవీ క్ శరణ మహం ప్రపద్యే సుతరసితర సే నమః
అగ్నేత్వం పార యానవ్యో అస్మాన్ద్స్వ స్తిభిరతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృధ్వీ బహులాన ఉర్వీ భవాతో కాయ తనయాయ శంయో
విశ్వానినో దుర్గ హా జాత వేద స్సిన్దాంనావా దురితా తి పర్షి
అగ్నే అత్రివ న్మ న సా గృహ్ణా నో స్మాకం బాద్య వాతిత నూనామ్
పృత నాజిత గ్ సహమాన ముగ్ర మగ్నింగ్ హువేమ పరమాథ్స ధస్థాత్
సనః పర్ష ద తి దుర్గాణి విశ్వాక్షా మద్దేవో అతిదురితా ద్ద్యగ్ని:


ప్రత్నోషిక మీడ్యో అధ్వరేషు సనాచ్చహొ తానవ్య శ్చ సత్సి
స్వాంచాగ్నే తనువంపిప్రయ  స్వాస్మభ్యంచ సౌభగ మాయజస్య
గోభి జుష్ట మయుజో నిషిక్తం తవేన్ద్ర విష్టోర ను సంచ రేమ
నాక వ్య పృష్ట మభి సంపసానో వైష్ణవీం లోక ఇహ మాదయం తామ్
(ఓం ఐం శ్రీసరస్వతీ దేవ్యై నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి)

సాష్టాంగ నమస్కారం
శ్లో|| ఉరసా - శిరసా - దృష్ట్వా - మనసా వచసా తదా
పద్బాం కరాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే
ఓం శ్రీ సరస్వత్యై నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారం
శ్రీ సరస్వతీ దేవికి 14 ప్రదక్షిణం చేయాలి. అప్పుడీ దిగువ మంత్రం 14  సార్లు జపించాలి.
పాశాంకుశ ధరా వాణీ వీణా పుస్తక ధారిణీ,
మమ వక్త్రే వసేన్నిత్యం దుగ్ద కుందేందు నిర్మలా
చతుర్దశ సు విద్యాసు రమతే యా సరస్వతీ
చతుర్ధశే షు లోకేషు సా మే వాచివ సేచ్చిరమ్
పాహిపాహి జగద్వంద్యే నమస్తే భక్తవత్సలే
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః
ఓం ఐం సరస్వత్యై నమః ..... ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

సర్వోపచార సమర్పణము
ఓం ఐం - సరస్వత్యై నమః ఛత్రం ధారయామి (అక్షతలు వేయవలెను)
ఓం ఐం - సరస్వత్యై నమః చామరౌ వీజయామి (అక్షతలు వేయవలెను)
ఓం ఐం - సరస్వత్యై నమః గీతం శ్రావయామి (అక్షతలు వేయవలెను)
ఓం ఐం - సరస్వత్యై నమః నృత్యం దర్శయామి (అక్షతలు వేయవలెను)
ఏవం విథ సమస్తరాజోపచార, దేవోపచార , శక్త్యోపచార , భక్త్యోపచార, సమస్తం సమర్పయామి


శ్లో|| యద్యద్ద్ర వ్య మా పూర్వంచ ప్రథివ్యా మతి దుర్గ భమ్
దేవ భూపార్హ భోగంచ తద్ద్రవ్యం దేవి సంగృహ్యతాం
అనుకొని అక్షతలు నీళ్ళు చల్లవలెను
పూజయందు మనకు తెలిసిగాని తెలియకగాని ఏమైనా లోపములు జరిగి వుండవచ్చు గనుక ..... ఆ అపరాధములు క్షమించుమని ఈ దిగువ విధంగా స్తుతించవలెను.

అపరాధ క్షమాపణలు
ఓం అపరాధ శతంకృత్వా జగదంబేతి చొచ్చరేత్
యాం, గతిం సమవాప్నోతి నత్దాం బ్రహ్మాద య స్సురాః
కామేశ్వరి జగన్మాత సచ్చిదానంద విగ్రహే
గ్రుహాణార్ఘ నం ఇమాంప్రీత్యా ప్రసీద పరేమేశ్వరి  ||
సర్వరూపమాయీ దేవీ సర్వందేవీ మయం జగత్
అతో హం విశ్వరూపా త్వాంన మామి పరమేశ్వరీ మ్
యదక్షర పదభ్రష్టం మాత్రా హీనం చ యద్భవేత్
పూర్ణం భవతు తత్సర్వం త్వత్ప్రసాదా న్మ హేశ్వరీ
యదత్ర పాటే జగదంబికే మయా
విసర్గ బింద్వక్ష ర హీన మీరితం
తదస్తు సంపూర్ణ తమం ప్రసాదతః
సంకల్పసిద్ధిశ్చ సదైవ జాయతాం
యన్మాతా బిందు బిందు ద్వితయ
పద పాద ద్వంద్వ వర్ణాది హీనం
భక్త్యా భక్త్యాను పూర్వం ప్రసభకృతి
వసాద్వ్యక్త  మవ్యక్త మంబ
మొహాద జ్ఞానతోవా పటి తమ పటితం సాంప్రతం తే స్త స్మిన్
తత్సర్వం సాంగ మాసాం భగవతి వరదే త్వత్ప్ర పాదాత్ప్ర సీద


ప్రసీద భాగవత్యంబ ప్రసీద భక్త వత్సలే ,
ప్రసాదం కురుమే దేవి దుర్గే దేవి నమోస్తుతే
ఓమ్ తత్ సత్ ఓమ్      ||
పూజవసాన వేళ పుష్పాంజలి సమర్పణం
దోసిలిలో పూలుంచుకుని
సరస్వత నమస్తుభ్యం వరదే భక్త వత్సలే
ఉపాయనం ప్రదాస్యామి విద్యావృద్ధిం కురుష్వమే
భారతీ ప్రతిగృహ్ణాతు - భారతీ వై దదాతి చ
భారతీ తారగోభాభ్యాం - భారత్యైతే నమోనమః
అని పూలు జల్లి నమస్కరించి........

అనయా .... మయాక ..... త పూజయా భగవతీ సర్వాత్మికా శ్రీసరస్వతీ సుప్రతీతా .... సుప్రసన్నా ..... వరదాభవంతు .... ఏతత్సర్వం సరస్వతీ దేవతార్పణ మస్తు ...... (అని నీళ్ళు అక్షతలు పళ్ళెంలో వదలాలి)

                                     ఇతి శ్రీ సరస్వతీ నిత్య పూజా విధానం సంపూర్ణం
జైహింద్.

కాళరాత్రి ( సరస్వతి ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు మన తల్లి కాళరాత్రి రూపమున దర్శనమిచ్చి మనలను కాపాడనున్నది.
"కాళరాత్రి" శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై యుండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండములవలె గుండ్రనివి. ఈమె నాశికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్దభము. ఈమె తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయ ముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనపముండ్ల ఆయుధము, మఱొక ఎడమచేతిలో ఖడ్గము ధరించియుండును.

కాళరాత్రి స్వరూపము చూచుటకు మిక్కిలి భయానకము - కాని ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను "శుభంకరి" అనియు అందురు. కావున భక్తులు ఈమెను చూచి ఏ మాత్రము భయమును గాని, ఆందోళనను గాని పొందనవసరమే లేదు.

కాళరాత్రి మాతను స్మరించినంతమాత్రముననే దానవులు, దైత్యులు, రాక్షసులు, భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవుట తథ్యము. ఈమె యనుగ్రహమున గ్రహబాధలును తొలగిపోవును. ఈమెను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు మొదలగువాటి భయముగాని, శత్రువుల భయముగాని, రాత్రి భయముగాని ఏ మాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వధా భయవిముక్తులగుదురు.
ఈ తల్లి కరుణకు మీరు పాత్రులవాలని మనసారా కోరుకొంటున్నాను.
కాళరాత్రి ( సరస్వతి )
శ్లో|| ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నాఖరాస్థితా|
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్త శరీరిణీ |
వామపాదోల్లసల్లోహలతాకంటక భూషణా|
వర మూర్ధధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ || 
సరసాంక వృత్త గర్భ సీసము. (సరసాంక వృత్తము. - స జ స స య .. యతి 10)
కరుణింపవా! కలి కాల దుర్జన భయం - కర కాళరాత్రీ! సుఖంబునీవ?
హరియింపవా? కలుషాముల్ సుజనులన్ - కలఁగించుచుండన్గ కనవదేల?
లక్ష్యంబుతో ఖలున్, దహించగ నుపే - క్ష యదేలనమ్మా! సుజనులఁ గావ.
నాలసింపక మలినాత్ములన్ మడచి, మా - మది నుండిపొమ్మా! సమస్తమగుచు.
తే.గీ. ఖలుల పాలిట మాయమ్మ కాళరాత్రి.
సుజనులనుకాచుమాయమ్మ సుస్మితాంబ.
యనుచు జనులెల్ల నిన్గన కనుము మమ్ము.
వందనంబులు చేకొమ్ము భద్రకాళి.
సీస గర్భస్థ సరసాంక వృత్తము (స జ స స య .. యతి 10)
కలి కాల దుర్జన భయం కర కాళరాత్రీ!
కలుషాముల్ సుజనులన్ కలఁగించుచుండన్
ఖలున్, దహించగ నుపేక్ష యదేలనమ్మా!
మలినాత్ములన్ మడచి, మా మది నుండిపొమ్మా!
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నము.
జైహింద్.

26, సెప్టెంబర్ 2017, మంగళవారం

కాత్యాయని (లక్ష్మి) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు కాత్యనీ నామముతో దర్శనమిచ్చుచున్నది మన జగన్మాత. 
"కాత్యాయనీ మాత" బాధ్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులములోని గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.

ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును.

మన జగన్మాత కటాక్షం మీకు లభించాలని కోరుకొంటున్నాను.
కాత్యాయని (లక్ష్మి)
శ్లో|| చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినీ ||
దండక గర్భ సీసము. (దండకము త త త త త త  . . . . . )
కాత్యాయనీ నీదు కారుణ్యమున్నన్ బ్ర కాశింతుమే మేము ఘనతరముగ.
నీకన్న మాకున్న లోకేశ్వరెన్నంగ లేదమ్మ.మాయమ్మ! మోదమిమ్మ.
నీపాద పద్మంబులేపార జూడంగ దీపించు సత్యంబు తేజమబ్బు
పాపాలు పోకార్పి కోపాలనే బాపి మాపాల నీవుండుమా కృపాబ్ధి.
తే.గీ. దండకంబందు నీవేను తలచి చూడ.
మెండుగాతోచు. మదినిండి యుండుమమ్మ.
పండు వెన్నెల చలువలు నిండియుండు
నీదు చూపులు మమ్ముల సేద తీర్చు.
సీస గర్భస్థ దండకము. (త త త త త త  . . . . . )
కాత్యాయనీ నీదు కారుణ్యమున్నన్ బ్రకాశింతుమే మేము.
నీకన్న మాకున్న లోకేశ్వరెన్నంగ లేదమ్మ.మాయమ్మ!
నీపాద పద్మంబులేపార జూడంగ దీపించు సత్యంబు.
పాపాలు పోకార్పి కోపాలనే బాపి మాపాల నీవుండుమా!
నైవేద్యం : రవ్వ కేసరి.
జైహింద్.

25, సెప్టెంబర్ 2017, సోమవారం

స్కందమాత ( లలిత ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

2 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు మన తల్లి  స్కందమాతగా మనలను కటాక్షించుచున్నది.
కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.

స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.
ఈ తల్లి మిమ్ములను చల్లగా చూచుగాక.
స్కందమాత ( లలిత )
శ్లో|| సంహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా|
శుభదాస్తు సదాదేవీ స్కందమాతా యశస్వినీ ||
దీ వృత్త గర్భ సీసము(నదీవృత్తమున న త జ గగ .. యతి 8 )
నిలు మదిని, జయము గొలుపుమో సన్నుత - స్కందమాతా! నన్నుఁ గాంచవమ్మ!
పలుకుల వినయము నిలుపుమానందద - నవ్య తేజా! నిన్ను నమ్మి కొలుతు.
వెలుఁగ మది శ్రియము కలుగనీ జీవిత - మంత నాకున్ మదిన్ భ్రాంతి తీర.   
ఎలమినిడిభయము తొలగనీ పాప వి - ముక్తుఁ జేయన్ ననున్ బ్రోచు తల్లి!
తే.గీ. నీదు భక్తుల కోరికల్ నీవె కాక
తీర్చ నెవ్వరు కలరమ్మ? తీర్చుమమ్మ.
కరుణ చూపుచు ప్రజనెల్ల కావుమమ్మ.
శరణు శరణమ్ము జనయిత్రి శరణు శరణు.
సీస గర్భస్థ దీ వృత్తము. (న న త జ గగ .. యతి 8)
జయము గొలుపుమో సన్నుత స్కందమాతా!
నయము నిలుపుమానందద నవ్య తేజా!   
శ్రియము కలుగనీ జీవితమంత నాకున్ 
 భయము తొలగనీ పాప విముక్తుఁ జేయన్.
నైవేద్యం : పెరుగు అన్నము.
జైహింద్.

24, సెప్టెంబర్ 2017, ఆదివారం

కూష్మాండ ( కామాక్షి ) .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! నేడు నాలుగవ రోజున జగన్మాత కూష్మాండ రూపమున మనలనఉ కటాక్షించుచున్నది.
దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము లోని సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.

'అష్టభుజాదేవి' అని కూడా అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.

భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.ఈ జగన్మాత మిమ్ములను సరా నీడవోలె ఉండి రక్షించుగాక.
కూష్మాండ ( కామాక్షి )
శ్లో||  సురా సంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ|
దధానా హస్త పద్మభ్యాం కూష్మాండా శుభ దాస్తుమే ||
ప్రణవ వృత్త గర్భ సీసము. ( ప్రణవ వృత్తము - మ న య గ .. యతి 6 )
నిర్మల రూప! నే నిన్ మ్రొక్కెద నిల కూ  ష్మాండా! జగన్మాత! శంభురాణి!
నోరార పిల్తు దీనున్ నన్ గని తెరవున్  జూపన్ గదే తల్లి! శోభఁ గొలుప.
ఆనంద పూర్ణజ్ఞానాంభోధివి కనవే  మమ్మా! మహా దేవి! సమ్మతమున.
నవతేజ పూజ్య! ప్రాణంబీవెగ పరమే  శానీ! మహాదేవి! జ్ఞానమిమ్ము.
తే.గీ. 
నిత్యకల్యాణివీవమ్మ! నిరుపమాన! - సత్య సన్మార్గ గా సలుపు నన్ను.
బంధ చిత్రాదులన్ గల భారతాంబ! - సుందరోజ్వల తేజమా! చూపు భవిత.
సీసగర్భస్థ ప్రణవ వృత్తము
నే నిన్ మ్రొక్కెద నిల కూష్మాండా! - దీనున్ నన్ గని తెరవున్ జూపన్ 

జ్ఞానాంభోధివి కనవేమమ్మా! - ప్రాణంబీవెగ పరమేశానీ!
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు
జైహింద్.

23, సెప్టెంబర్ 2017, శనివారం

చంద్రఘంట (అన్నపూర్ణ) .. .. .. అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

 జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో ఈ మూడవ రోజున జగదంబ మనలను చంద్రఘంట(అన్నపూర్ణ) గా కరుణిస్తుంది.
ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే ఈమెకు 'చంద్రఘంట' యను పేరు స్థిరపడెను. ఈమె శరీరము బంగారు కాంతి మయము. ఈమె తన పది చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రములను, బాణము మున్నగు అస్త్రములను ధరించియుండును. ఈమె సింహ వాహన. ఈమె సర్వదా సన్నాహయై యుద్ధముద్రలోనుండును. ఈమె గంటనుండి వెలువడు భయంకరధ్వనులను విన్నంతనే క్రూరులై దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడు వడగడలాడుచుందురు. కాని భక్తులకును, ఉపాసకులకును ఈమె మిక్కిలి సౌమ్యముగను, ప్రశాంతముగను కన్పట్టుచుండును.

ఈ దేవి ఆరాధన సద్యఃఫలదాయకము. భక్తుల కష్టములను ఈమె అతి శీఘ్రముగా నివారించుచుండును. ఈ సింహవాహనను ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉందురు. ఏవిధమైన భయములును వారిని బాధింపజాలవు.
సర్వ మంగళ స్వరూపిణియైన ఈ తల్లి ఆశీస్సులు మీకు లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
చంద్రఘంట(అన్నపూర్ణ)
శ్లో|| పిండజప్రవరూరుఢా చంద్రకోపాస్త్ర కైర్యుతా|
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||
అంతరాక్కర - తేటగీతి - ఆటవెలది ద్వయ గర్భ సీసము
మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.
కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు కనఁగ కామిత ప్రద!
నయతనీయ, సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..
ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!
తే.గీ. నీదు పాదాబ్జములపైన నాదు మనసు
నిలువఁ జేయుమ! మాయమ్మ! నిన్నె కొలుతు.
నీవె రక్షీంపకున్నచో త్రోవ లేదు.

పార్వతీ! పతి తోడుగ వరలు మదిని.

సీస గర్భస్థ  అంతరాక్కర. 
(అంతరాక్కర1సూ.గణము, 2ఇం.గణములు, 1చం.గణము .. 
యతి 3వ గణము చివరి అక్షరము)
నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 
కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు
సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి
తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ  తేటగీతి..
నిరుపమము చంద్రఘంట నీ నిర్మలాత్మ 
కరుణఁ గను తల్లి వీవెగా కాపు మాకు
సరగునను వచ్చి కొల్పు సత్సంగ రక్తి. 
తరుణ మిది కావ నన్ను తత్వార్థ భాస! 

సీస గర్భస్థ ఆటవెలది ద్వయము.
౧. మాన్య రూప! నిరుపమము చంద్రఘంట నీ - నిర్మలాత్మ సుగుణ ధర్మ బోధ.
కలిమిఁ గూర్చి కరుణఁ గను తల్లి వీవెగా - కాపు మాకు కనఁగ కామిత ప్రద!
౨. నయతనీయ, సరగునను వచ్చి కొల్పు స - త్సంగ రక్తి.  వరశుభాంగ నీవు..
ఎన్ని చూడ తరుణ మిది కావ నన్ను త - త్వార్థ భాస! కనుమ! వరల నిమ్మ!
జైహింద్.

22, సెప్టెంబర్ 2017, శుక్రవారం

బ్రహ్మచారిణి( గాయత్రి ) రుచిర గర్భ సీసము. .. .. .. చిత్ర బంధ గర్భ కవితాదులు.,

1 comments

జైశ్రీరామ్.
ఆర్యులారా! శరన్నవరాత్రులలో రెండవ రోజైన నేడు ఆ జగన్మాత బ్రహ్మచారిణి రూపంలో మనలను కటాక్షిస్తుంది.
'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రథము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
మీ అందరికీ జగ్న్మాత కటాక్షం పూస్ర్తిగా లభించాలని మనసారా కోరుకొంటున్నాను.
బ్రహ్మచారిణి( గాయత్రి )
శ్లో|| దధానా కరపద్మాభ్యాం అక్షమలాకమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||
రుచిర గర్భ సీసము. ( రుచిరము. - జ భ స జ గ .. యతి 9)
శ్రీమాతవు పరాత్పరీ కను నను బ్రహ్మ - చారిణీ! భక్తితో సంస్తుతింతు.
నిన్నే గనితరింతునేన్ మది నిను దాల్చి - భక్తితో నిరతంబు భజన చేతు.
ప్రార్థింతునునిరంతరంబసదృశ నిశ్చ- లాత్మతో నిన్నెంచి యజ్ఞ రూప.
నీరూపునె స్మరింతు నిన్ ననుఁగను మాతృ - దేవతా! వరమీగదే శివాని.
దివ్య నవరాత్రిలోనిద్వితీయ మూర్తి
బ్రహ్మచారిణివైమమ్ము బ్రతుకఁ జేయ
మమ్ము కరుణించి వచ్చితే కమల నయన!
వందనంబులు చేకొమ్ము పావనాఘ్రి!
సీస గర్భస్థ రుచిరవృత్తము. ( రుచిరము. - జ భ స జ గ .. యతి 9)
పరాత్పరీ కను నను బ్రహ్మచారిణీ!
తరింతునేన్ మది నిను దాల్చి భక్తితో
నిరంతరంబసదృశ నిశ్చలాత్మతో

స్మరింతు నిన్ ననుఁ గను మాతృ దేవతా!
నైవేద్యం :  పులిహోర
 జైహింద్.