గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, ఆగస్టు 2017, మంగళవారం

నూతన ఛందములలో గర్భ కవిత 112 . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
మసజామజా.స్వగత.స్వార్ధమ.గర్భ ప్రలాపినీవృత్తము.
రచన.వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
శివదూషణ నిందార్హము.
సమఙస్త చరాచర జీవజగతిని నడించు మహత్తర శక్తియే పరమాత్మ.
జగత్పితరులుపారవ్వతీపరమేశ్వరులు.దేవతలలోగణనీయుడైన
శివుడభిషేక ప్రియుడు.శివరూపముననేమనకువశముకాగలడు.
అతనిని రుద్రరూపమున చూడజాలము.శివసాకషాత్కారమునందు
టకు జన్మ జన్మల యదృష్టము కావలెను.అట్టి మహనీయుని నభిషేకించుటకు
నమక చమకములనుస్మృతిప్రోక్తముగనుపయోగింతురు.
నమక చమకములకుతమకముచేర్చుట పాపహేతువు.యేలనన తమము
నకుమత్తు నిద్ర శోకమనునర్ధములుగలవు.తమకమనేపదమునకు
మోహము సంభ్రమము కోరిక యనునర్ధములుగలవు ముక్తియందు
మోహము పొందాలనేకోభగవత్కీర్్యైంకర్యమునందాశ్చర్యముండుట
తప్పుగాదు.ఏదియేమైనను పవిత్రమైన నమకచమకములవెంట
తమక ప్రయోగము పరమాత్ముని ముమ్మాటికి కించపరచినట్లేయగును.
ప్రలాపినీవృత్తము.
అజ్ఞానాంధ కారాన జిక్కి యన్నింటం పరిపూర్ణులంచు నంతర్యామి లెక్కించకన్
విజ్ఞానంబదే మాదటంచు వెన్నంటెం సిరి దైవమెంత వింతౌవ్యాఖ్య    విశ్వేశునిన్
సుజ్ఝానంబనంగా సరౌనె సున్నాయౌ భవితెంచరేమి సుంతం భక్తి మృగ్యంబవన్
ప్రజ్ఞా? ఈప్రలాపంబు తప్పు బన్నంస్మస్మృతి కించపర్చ పంతుంగాన 

రేనాటికిన్.
1.అజ్ఞానాంధకారాన జిక్కి
విజ్ఞానంబదే మాదటంచు
సు జ్ఞానంబనంగా సరౌనె
ప్రజ్ఞా? ఈప్రలాపంబు తప్పు.
2.యన్నింటం పరిపూర్ణులంచు
వెన్నంటెం సిరి దైవమెంత?
సున్నాయౌ భవితెంచరేమి?
బన్నంబౌ స్మృతి కించపర్చ.
3.నంతర్యామి లెక్కించకన్
వింతౌ యాఖ్య విశ్వేశువిన్
సుంతం భక్తి మృగ్యంబవన్
పంతుం గానరేనాటిన్.
4.అజ్ఞానాంధకారాన జిక్కి యన్నింటం పరిపూర్ణులంచు
విజ్ఞానంబదే మాదటంచు వెన్నంటెం సిరి దైవమెంత
సుజ్ఞానంబనంగా సరౌనె సున్నాయౌ భవితెంచరేమి
ప్రజ్ఞా? ఈప్రలాపంబుతప్పు బన్నంబౌ స్మృతి కించపర్చ.
5.యన్నింటం పరిపూర్ణులంచు నంతర్యామి లెక్కించకన్
వెన్నంటెం సిరి దైవమెంత?వింతౌవ్యాఖ్య విశ్వేశునిన్
సున్నాయౌ భవితెంచరేమి?సుంతం భక్తి మృగ్యంబవన్.
బన్నంబౌ స్మృతి కించపర్చ. పంతుంగాన రేనాటికిన్.
6.)అంతర్యామి లెక్కించకం అజ్ఞానాంధ కారాన జిక్కి
వింతౌవ్యాఖ్య విశ్వేశునిం విజ్ఞానంబదే మాదటంచు
సుంతం భక్తి మృగ్యంబవం సుజ్ఞానంబనంగా సరౌనె
పంతుం గానరేనాటికిం ప్రజ్ఞా?ఈప్రలాపంబు తప్పు.
7.అంతర్యామి లెక్కించకం అజ్ఞానాంధ కారానజిక్కియన్నింటటం పరపూర్ణులంచు.
వింతౌవ్యాఖ్య విశ్వేశునిం విజ్ఞానంబదే మాదటంచు వెన్నంటెం సిరి దైవమెంత?.
సుంతం భక్తి మృగ్యంబవం సుజ్ఞానంబనంగాసరౌనె సున్నాయౌ భవితెంచరేమి
పంతుంగానరేనాటికిం ప్రజ్ఞా? ఈప్రలాపంబు తప్పు బన్నంబౌ స్మృతి కించపర్చ.
8.యన్నింటం పరిపూర్ణుడంచు నజ్ఞానాంధ కారాన జిక్కి
వెన్నంటెం సిరి దైవమెంత ? విజ్ఞానంబదే మాదటంచు
సున్నాయౌ భవితెంచరేమి సుజ్ఞానంబనంగా సరౌనె
బన్నంబౌ స్మృతి కించపర్చ ప్రజ్ఞా ?ఈప్రలాపంబుతప్పు.
9.యన్నింటం పరిపూర్ణులంచు నజ్ఞానాంధ కారానజీక్కినంతర్యామిలెక్కించకన్
వెన్నంటెంసిరి దైవమెంత ? విజ్ఞానంబదేమాదంచువింతతౌవ్యాఖ్య విశ్వేశునిన్
సున్నాయౌ భవితెంచరేమి సుజ్ఞానంబనంగాసరౌనె సుంతంభక్తిమృగ్యంబవన్
బన్నంబౌస్మృతి కించపర్చ ప్రజ్ఞా?ఈప్రలాపంబుతప్పు పంతుంగానరేనాటికిన్.
10.అన్నింటంపరిపూర్ణులంచు నంతర్యామి లెక్కించకన్ యజ్ఞానాంధకారానజీక్కి
వెన్నంటెంసిరి దైవమెంత?వింతౌయజ్ఞానాంధకారానజీక్కి విజ్ఞానంబదేమాదటంచు
సున్నాయౌ భవితెంచరేమి?సుంతంభక్తి మృగ్యంబవన్ సుజ్ఞానంబనంగాసరౌనె
బన్నంబౌ స్మృతి కించపర్చ పంతుంగానరేనాటికిన్.ప్రజ్ఞా?ఈప్రలాపంబు తప్పు.
ప్రలాపినీ వృత్తము.ఉత్కృతి.మ.య.జ.మ.స.జ.మయ.లగ.యతులు.10.19.
1.స్వార్ధ చింత బృహతీ. వృ.సం.329.
2.రక్షదా .బృహతీ మ.స.జ.వృ.సం.345.
3.మూలాధార..అనుష్టుప్.మ.య.లగ.వృ.షం.73.
4.మజా ధృతి.మ.య.జ.మ.స.జ.యతి.10.
5.అంతర్యామి.అత్యష్టీ.మ.స.జ.మ.య.లగ.యతి..10.
6.మాయా అత్యష్టీ.మ.య.య.త.ర.గల.యతి.9.
7మాయాయుతి ఉత్కృతి మ.య.య.త.త.ర.త.జ.గల.యతులు.9.18.
8.మసజామజా ధృతి మ.స.జ.మ.జ.జ.యతి.10.
9.స్వగత..ఉత్కృతి.మ.స.జ.మ.జ.జ.మ.య.లగ.యతులు.9.18.
10.స్వార్ధమ.ఉత్కృతి మ.స.జ.మ.య.త.త.త.గల.యతులు.10.18.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభ వఝులవారి ప్రలాపినీ వృత్తము " వ్యాజస్తుతిలో అద్భుతముగా నున్నది .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.