గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జులై 2017, సోమవారం

నూతన ఛందములలో గర్భ కవిత 98. . . . రచన . . . శ్రీ వల్లభ

  జైశ్రీరామ్
ఆతప. భద్రత. భాసుదీ. గుణోన్నతి. మృదుమేధ.మిత్రమా.మేధినీ. మేల్గను. చిత్ర గతి .చెడువిడు గర్భనీతిచర వృత్తము. 
రచన. వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి .  జుత్తాడ. 
నీతి చర వృత్తము. 
మిత్రుని మాటలు విను మేలును గన చెడువిడు మేధిని సుఖ మందుమయా 
చిత్రపు టూహలు గను చీలనిమది గుణమున భేదిలు దురితంబు భువిన్ 
తత్రపు సారము మది తాలగవలె పటుతను  తాదివిసుఖమందెదులే
శత్రుల చేర్చకుదరి చాలును కనినవను సాధితుడ వనందగు మా
1. మిత్రుని మాటలువిను 
చిత్రపుటూహలుగను 
తత్రపు సారము మది
శత్రుల చేర్చకు దరి. 
2 మేలును గను చెడు విడు
చీలని మది గుణమున
తాలగవలె పటుతను. 
చాలును కనినవను. 
3.మేధిని సుఖ మందు మయా 
భేదిలు దురితంబు భువిని. 
తా దివి సుఖమందెదు లే .
సాధితుడ వనందగుమా. 
4. మిత్రుని మాటలు విను మేలును గను చెడు విడు
. చిత్రపు టూహలు గను చీలనిమది గుణమున .
తత్రపు సారము మది తాలగవలె పటుతను .
శత్రుల చేర్చకు దరి చాలును కనిన వను. 
5. మేలునుగను చెడు విడు మేధిని సుఖమందు మయా 
చీలని మది గుణమున భేదిలు దురితంబు భువిన్ .
తాలగవలె పటుతను తాదివవి సుఖమందెదులే 
చాలును కనినవను సాధితుడ వనందగుమా ..
6. మేలునుగను చెడు విడు మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలువిను. 
చీలనిమది గుణమున భేదిలుదురితంబు భువిం చిత్రపు టూహలుగను. 
తాలగవలె పటుతను తా దివిని  సుఖ మందెదులే తత్రపు సారము మది.
చాలును కనినవను సాధితుడ వనందగుమా శత్రుల చేర్చకు దరి. 
7.మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలు విను 
భేదిలు దురితంబు భువించిత్రపు టూహలుగను .
తా దివిసుఖమందెదులే తత్రపు సారముమది.
సాధితుడ వనందగుమా శత్రుల చేర్చకుదరి .
8.మేధిని సుఖమందుమయా మిత్రుని మాటలువిను మేలునుగను చెడువిడు .
ఛేదిలు దురితంబు భువిం  చిత్రపుటూహలుగను చీలనిమది గుణమున. 
తా దివిసుఖ మందెదులే తత్ర సారముమది తాలగవలె పటుతను.
సాధితుడవనందగుమా శత్రుల చేర్చకుదరి చాలును కనినవను .

9.మేలునుగను చెడువిడు మిత్రుని మాటలువిను .
చీలని మదిగుణమున చిత్రపు టూహలుగను .
తాలగవలె పటుతను తత్రసారముమది 
చాలును కనినవను శత్రుల చేర్చకు దరి .
10.మేలునుగను చెడువిడు మిత్రునిమాటలు విను మేధిని సుఖమందు మయా. 
చీలని మది గుణమున చిత్రపుటూహలుగనుఛఛేదిలుదురితంబు భువిన్ .
తాలగవలె పటుతను తత్రపు సారముమది తా దివిసుఖమందెదులే .
చాలును కనినవను శత్రులచేర్చకుదరి సాధితుడ వనందగుమా .
నీతిచర వృత్తము .ఉత్కృతి భ.భ.స.న.న.స.న.జ.లగ. యతులు 9.18.
1. ఆతప .అనుష్టుప్ భ.భ.లల.వృ.సం. 247.
2.భద్రత బృహతీ భ.న.న.వృ.సం. 511. 
3.భాసుధీ .బృహతీ .భ.స.స.వ.సం. 223.
4.గుణోన్నతి .అత్యష్టీ .భ.భ.స.న.న.లల.యతి 9.
5.మృదుమేథ ధృతి భ.న.న.భ.స.స. యతి10.
6.మిత్రమా భ.న.న.భ.స.స.భ.భ.లల.యతులు 10.19.
7.మేథినీ కృతి భ.స.స.భ.భ.భ.లల. యతి10
8.మేల్గను ఉత్కృతి భ.స.స.భ.భ.స.న.న.లల. యతులు 10.18.
9.చిత్రగతి అత్యష్టీ భ.న.న.భ.భ.లల యతి 10.
10.చెడువిడు .ఉత్కృతి భ.న.న.భ.భ.స.న.జ.లగ. యతులు 10.18.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.