గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జులై 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 89. . . . రచన . . . శ్రీ వల్లభ

 జైశ్రీరామ్.
        సమాశ్రి. నిడుపుండ్ర. మోక్షార్ధీ. శ్రీనారీ. సారజ. నానీభావ. అనిమిష. ఏలికా. గర్భ. రసపాలనావృత్తము.  
                                        రచన. వల్లభవఝల. అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.                                         రసపాలనా. వృత్తము. 
నాకలోక మేలువారు నరలోకముననేలరాగ నా నీ భావంబు దనరు
చీకు  చింతలందుచుండి స్థిరమెంచరు స్వార్ధ బుద్ధి శ్రీనే వాంఛింతు రెపుడు
ప్రాకులాట కీర్తి కోరి పర భుక్తపుటాశ నంది  పానీయంబదొరుల
తాకరయ్య నీతికాంత తరియింపగ నోచుకోరు తానే దైవమనుచు .
గర్భ గతవృత్తములు 
1. నాక లోక మేలువారు 
చీకుచింత్లందు చుండి
ప్రాకులాట కీర్తి కోరి 
తాకరయ్య నీతి కాంత .
2.నరలోకము నేల రాగ
స్థిరమెంచరు స్వార్ధ బుద్ధి
పరభుక్తపుటాశ నంది 
తరియింపగ నోచుకోరు. 
3.నా నీ భావంబు గుదురు 
శ్రీనే వాంఛింతు రెపుడు.
పానీయంబదొరుల
తానే  దైవ మనుచు.
4. నాక లోక మేలు వారు నరలోకము నేల రాగ .
చీకు చింత లందు చుండి స్థిరమెంచరు స్వార్ధ బుద్ధి. 
ప్రాకులాట కీర్తి కోరి పర భుక్తపు టాశనంది
 తాకరయ్య నీతి కాంత తరియింపగ నోచు కోరు .
5. నరలోకము నేలరాగ నా నీ భావంబు గుదురు. 
స్థిరమెంచరు స్వార్ధ బుద్ధి శ్రీ నే వాంఛింతురెపుడు .
పర భుక్తపు టాశ నంది పానీయంబదొరుల  
తరియింపగ నోచు కోరు తానే దైవమనుచు .
6.నరలోకము నేలరాగ నా నీ భావంబు గుదురు నాక లోక మేలు వారు 
స్థిర మెంచరు స్వార్ధబుద్ధి శ్రీ నే వాంఛింతురెపుడు చీకు చింత లందు చుండి 
పరభుక్తపు టాశనంది పానీయంబదొరుల ప్రాకులాట కీర్తి కోరి 
తరియింపగ నోచుకోరు తానే  దైవమనుచు తాకరయ్య నీతి కాంత .
7. నా నీ భావంబు గుదురు నాక లోక మేలువారు నరలోకము నేలరాగ 
 శ్రీ నే వాంఛింతు రెపుడు చీకు చింత లందుచుండి స్థిర మెంచరు స్వార్ధ బుద్ధి .
పానీయంబదొరులప్రకాకులాట కిర్తి కోరి పరభుక్తపుటాశశ నంది 
తానే దైవమనుచు తాకరయ్య నీతి కాంత తరియింపగ నోచుకోరు .
8. నా నీ భావంబు గుదురు నాకలోక మేలువారు నరలకము నేలరాగ 
శ్రీ నే వాంఛింతు రెపుడు చీకు చింతలందుచుండి స్థిరమెంచరు స్వార్ధ బుద్ధి 
పానీయంబదొరుల ప్రాకులాట కీర్తి కోరి  పరభుక్తపు టాశనంది. 
తానే దైవమనుచు తాకరయ్య నీతి  కాంత తరియింపగ నోచు కోరు. 

రసపాలనా  .అభికృతి ర.జ.భ.జ.జ.ర.మ.న.ల యతులు 9.18.
గర్భ గత వృత్తములు. 
1.  సమాశ్రి అనుష్టుప్ .ర.జ.గల..వృ.సం.171
2.నిడుపుండ్ర. బృహతి. స.స.య.వృ.సం. 92. 
3.మోక్షార్ధి.అనుష్టుప్. మ.భ.లల.వృ.సం.241. 
4. శ్రీనారీ .అత్యష్టీ.ర.జ.భ.జ.జ.గల.యతి.9.
5.సారజ. అష్టి  .స.స.జ.మ.భ.ల..యతి.8.
6.నానీభావ. అభికృతి. స.స.జ.మ.భ.స.జ.ర.ల  .యతులు.10.18.
7.అనిమిష. అష్టి. మ.భ.స.జ.ర.ల.యతి.9.
8 . ఏలికా. అభికృతి. మ.భ.స.జ.ర.న.భ.ర.ల.యతులు.9.17.
 జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి కలమునుండి జాలువారిన " రసపాలనా వృత్తము లోని గర్భగత వృత్తములు రసరమ్యముగా నున్నవి . ఇంత చందస్సును తెలుసుకో గలగడం మా పూర్వజన్మ సుకృతం . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.