గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జులై 2017, శుక్రవారం

నూతన ఛందములలో గర్భ కవిత 82. . . . రచన . . . శ్రీ వల్లభ

జైశ్రీరామ్.
రసచంపకము
రచన. వల్లభవఞఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ 
                    రస చంపకము

కరమరుదైనచోట సుమగంధము చిందెడుచోట కౌముదుల్విర జిమ్ముచో
సుర వరసారసాలు మది సుందర మేర్చెడిచోట సోమయాజుల యాగముల్
గురుతరభావరాజి వెరగొందక నిల్చినచోట కోమలంబగు వేదముల్
పరిగణనీయమౌత గురువందన మందుత శోభ భ్రామణిం సిరివారమై
1. కరమరుదైనచోట
సురవర సారసాలు
గురుతరభావరాజి
పరిగణనీయమౌత
2. గంధముచిందెడుచోట
సుందరమేర్చెడిచోట
గొందక నిల్చినచోట
వందన మందుత శోభ
3. కౌముదుల్విరజిమ్ముచో
సోమయాజులయాగముల్
కోమలంబగు వేదముల్
భ్రామణిన్సిరి వారమై
4. కరమరుదైన చోట సుమగంధము చిందెడు చోట
సురవరసారసాలు మదిసుందరమేర్చెడడి చోట
గురుతర భావరాజి వెరగొందక నిల్చిన చోట
పరిగణనీయ మౌత గురువందన మందుత శోభ.
5. గంధముచిందుచోట కౌముదుల్విర జిమ్ముచో
సుందరమేర్చెడిచోట సోమయాజుల యాగముల్
గొందక నిల్చిన చోట కోమలంబగు వేదముల్
వందన మందుతశోభ భ్రామణింసిరి వారమై.
6.  కౌముదుల్విర జిమ్ముచో కరమరుదైన చోట
సోమయాజుల యాగముల్ సురవరసారసాలు.
కోమలంబగు వేదముల్ గురుతర భావరాజి
భ్రామణింసిరి వారమై పరిగణనీయమౌత .
7.కౌముదుల్విర జిమ్ముచో కరమరుదైనచోట సుమగంధము చిందెడు చోట
సోమయాజుల యగముల్ సురవర సారసాలు మదిసుందర మేర్చెడి చోట.
కోమలంబగువేదముల్ గురుతరభావ రాజి వెరగొందక నిల్చిన చోట. 
భ్రామణిం సిరి వారమై పరిగణనీయమౌత గురువందన మందుత శోభ.
8. గంధము చిందెడు చోట కౌముదుల్విరజిమ్ముచో కరమరుదైనచోట
సుందర మేర్చెడి చోట సోమయాజులయాగముల్ సురవరసా రసాలు
గొందక నిల్చిన చోట కోమలంబగు వేదముల్ గురుతర భావరాజి
వందనమందుత శోభ భ్రామణిం సిరి వారమై పరిగణనీయమౌత.

రసచంపకము. న.జ.భ.జ.జ.జ.ర.స.లగ. ఉ త్కృవిషయము: జీవప్రేమ. వరీయ .నవనీత.గంధినీ.కౌముది. కరమరుదు. గంధినీవర. సుధాకర .గర్భ.రసచంపకము.
55తి .యతులు 11.19.
గర్భగత వృత్తములు.
1. జీవప్రేమ. న.జ.గల. వృ.సం.176. అనుష్టుప్.
2. వరీయ. అనుష్టుప్. భ.భ.గల.వృ.సం. 183.
3. నవనీతసమ. అనుష్టుప్. ర.స.లగ. వృ.సం.91. 
4. గంధినీ .ధృతి .న.జ.భ.జ.జ.జ..యతి 11. 
5. కౌముది. అతిశక్వరి. భ.ర.జ.భ.ర. యతి .8. 
6.కరమరుదు. అష్టీ. ర.స.జ.న.ర.ల. యతి .9. 
7. గంధినీవర. ఉత్కృతి .ర.స.జ.న.ర.న.భ.భ.గల. యతు లు. 9.19.
8. సుధాకర. సంకృతి. భ.భ.ర.జ.జ.భ.స.జ. యతు లు. 9.17.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మధుర రసములు విరజిమ్ముతున్న" రస చంపకమే అద్భుతముగా ఉందనుకుంటే , అందుండి జనించిన ఛందస్సులు మరింత రమణీయముగా నున్నవి. సరస్వతీ పుత్రులు శ్రీ వల్లభవఝులవారిని శ్లాఘించ భాష లేదు. కృతజ్ఞతలతో పాదాభి వందనములు. స్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.