గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, జులై 2017, గురువారం

నూతన ఛందములలో గర్భ కవిత 81. . . . రచన . . . శ్రీ వల్లభ


జైశ్రీరామ్.
నిదర్శన.పూర్ణేందు. సద్వర. భంగిమ. నీమక. శుభాద్రి. నీమావళీ.చెలిమిల. నిరుపమా గర్భ
వరగతి వృత్తము
రచన. వల్లభవఝల అప్పల నసింహ మూర్తి. 
జుత్తాడ.
వరగతి వృత్తము
నేయముజేయు  మి నీతిని నీమంబును మీరకెపుడు నిరుపంబదియౌ
కాయముబాయుట తధ్యము కామంబును వీడవలెను కరమున్శుభమౌ
ధ్యేయము ధర్మము నొప్పగ ధీమంతుడవీవెయగుదు తిరుగే గనకన్
శ్రీయమ నిల్చును నిత్యము శ్రీమంతమదే నరునకు స్థిర కీర్తునకున్.
1. నేయముజేయుమి నీతిని
కాయము బాయుట తథ్యము
థ్యేయము ధర్మము నొప్పగ
శ్రీయమ నిల్చును నిత్యము
2.నీముంబును మీర కెపుడు
కాముబును వీడవలెను
ధీమంతుడవీవెయగుదు
శ్రీమంత మదే నరునకు
3. నిరుపంబదియౌ
కరముం శుభమౌ
తిరుగే గనకన్
స్థిర కీర్తు నకున్
4.  నేయము జేయు నీతిని నీమంబును మీరకెపుడు
కాయము బాయుట తధ్యము కామంబును వీడవలెను
ధ్యేయము ధర్మము నొప్పగధీమంతుడ వీవె యగుదు
శ్రేయము నిల్చును నిత్యము శ్రీమంత  మదే నరునకు.
5. నీమంబును మీరకెపుడునిరుపంబదియౌ 
కామంబును వీడవలెను కరమున్శుభమౌ
ధీమంతుడ వీవె యగుదు తిరుగే గనకన్
శ్రీమంత మదే నరునకు స్థిరకీర్తునకున్
6. నిరుపంబదియౌ నేయము జేయుమి నీతిని
కరముశన్శుభమౌ కాయముబాయుట తధ్యము.
తిరుగేగనకన్ ధ్యేయము ధర్మము నొప్పగ
స్థిర కీర్తునకున్ శ్రీయమ నిల్చును నిత్యము
7. నిరుపంబదియౌ నేయముజేయుమి నీతిని నీమంబుమీరకెపుడు
కరమున్శుభమౌ కాయము బాయుట తథ్యము కామంబును వీడవలెను
తిరుగేగనకన్ ధ్యేయము ధర్మము నొప్పగ ధీమంతుడ వీవె యగుదు
స్థిర కీర్తునకున్ శ్రీయమ నిల్చును నిత్యము శ్రీమంతమదే నరునకు
8. నీమంబును మీరకెపుడు నిరుపంబదియౌ నేయము జేయుమి నీతిని
కామంబును వీడవలెకరమున్శన్శుభమౌ కాయము బాయుట తధ్యము
ధీమంతుడ వీవె యగుదు తిరుగేగనకన్ ధ్యేయము ధర్మము నొప్పగ
శ్రీమంతమదే నరునకు స్థిర కీర్తునకున్ శ్రేయము నిల్చును నిత్యము
9. నీమంబును మీరకెపుడు నేయము జేయుమి నీతిని నిరుపంబదియౌ
కామంబును వీడవలెను కాయము బాయుటతథ్యము కరమున్శుభమౌ
ధీమంతుడ వీవె యగుదు ధ్యేయముధర్మము నొప్పగ తిరుగే గనకన్
శ్రీమంతమదే నరునకు శ్రేయము నిల్చును నిత్యము స్థిర కీర్తు నకన్


వరగతివృత్తము.సంకృతి భ.భ.భ.త.జ.న.స.స..యతులు. 10.19.

గర్భగతవృత్తములు.
1. నిదర్శన.బృహతీ.భ.భ.భ..వృ.సం.439.
2. పూర్ణేందు.బృహతీ. త.జ.న.   వృ.సం.493.
3. సద్వర.  గాయిత్రీ  .స.స.వృ.సం.28. . 
4. భంగిమ. ధృతి. భ.భ.భ.త.జ.న.యతి.10. 
5.నీమక. అతిశక్వరీ. త.జ.న.స.స. .యతి 10. 
6. శుభాద్రి .అతిశక్వరీ. స.స.భ.భ.భ. యతి. 7. 
7. నీీమావళీ. సంకృతి. స.స.భ.భ.భ.త.జ.న. యతులు. 7.16.
8. చెలిమిల. సంకృతి. త.జ.న.స.స.భ.భ.భ.యతతులు. 10.16.
9. నిరుపమ. సంకృతి. త.జ.న.భ.భ.భ.స.స.యతులు. 10.19.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.