గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జూన్ 2017, శుక్రవారం

ఏ గ్రహాన్ని ఏ పుష్పాలతో పూజించాలని భవిష్య పురానమ్ చెప్పిందో తెలుసా? . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
ఆర్యులారా! 
మనం ఏ గ్రహాన్ని ఏ పుష్పాలతో అర్చించాలో 
భవిష్య పురాణం చెప్పింది చూడండి.
గీ. పచ్చ గన్నేరు తగునయ్య భాస్కరునకు 
చలువ రేనికి తగినది కలువ పూజ,
దిరిసెనలతోడ కుజునకు, దివ్యుఁడైన
బుధుని సంపెంగ తోడను, పూజ్యుఁడైన
గురుని పద్మాలతోడను, విరిసినట్టి
జాజి పూలను శుక్రుని, శనిని మల్లె, 
రాహువును మొల్ల పూలతో, రమ్యమైన
వివిధ పుష్పాల కేతువున్, బ్రీతిఁ గొలుతు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గ్రహ పూజను గురించి ఎన్నో తెలియని విషయాలను చక్కగా వివరించారు. ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.