గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జూన్ 2017, గురువారం

మూర్ఖస్య పంచ చిహ్నాని . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. మూర్ఖస్య పంచ చిహ్నాని గర్వో దుర్వచనం తథా 
క్రోధశ్చ దృఢవాదశ్చ పరవాక్యేష్వనాదరః.
గీ. గర్వమును, దుర్వచనతను కలిగి యుంట,
కోప వర్తన,పిడివాద మాపరాని
పరులవాగనాదరతయు ప్రబలియుండు
మూర్ఖులం దుండవివి కనఁ బూజ్యులందు.
భావము. గర్వము, చెడుమాటలు మాట్లాడుట, కోపము, పిడివాదము, ఇతరుల భాషణమునందు అనాదర భావము అను ఐదు మూర్ఖుల లక్షణములు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అను నిత్యం తటస్త పడుతున్న మూర్ఖుల లక్షణాలను చక్కగా వివరించారు . ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.