గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, మే 2017, బుధవారం

శిశుథ్వం స్రైణం వాభవతు . . . మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. శిశుథ్వం స్రైణం వాభవతు నను వంద్యాసి జగతిం!
గుణాః పూజాస్థానం గుణుషు న చ లిజ్ఞం న వయః!!
క. గుణములు పూజ్యములిలలో
గుణములకున్ వయసు లేదు. కుల లింగాదుల్
గుణములకుండవు కావున
గుణవంతుల గౌరవించుకొనవలె కూర్మిన్.
భావము. గుణవంతులు శిశువులు కావచ్చును, స్త్రీలు కావచ్చును. వారు లోకమున గౌరవార్హులు. గుణములు పూజాస్థానములు. గుణములయందు లింగము వయసు అనునవి ఉండవు. అందుకే గుణములు పూజనీయములు. అటువంటి గుణములు చూద్దామంటే పూజ్యమే (శూన్యమే) అని తోచుతుంది లోకంలో.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.