గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2017, ఆదివారం

కెనడాలో వెలువరించిన " తెలుగు తల్లి " కి జేజేలు పలికిన డా.గన్నవరపు నరసింహమూర్తి కవి.

జైశ్రీరామ్.
ఆర్యులారా!
కెనడాలో వెలువరించిన " తెలుగు తల్లి " కి జేజేలు పలికిన భిషగ్వరేణ్యులు 
డా.గన్నవరపు నరసింహమూర్తి కవి. 
ఎంత రమ్యమైన రచనో చదివితే మీకే తెలుస్తుంది.
శ్రీమాన్ నరసింహమూర్తి కవిగారిని హృదయపూర్వకముగా అభినందిస్తూ ఆ పద్యం మీ ముందుంచుతున్నాను.
తెలుగు తల్లి
సీ. పలుకు పలు కనంగఁ జిలుక చేతను బూని
తేనె లొల్కుచుఁ బల్కు తెలుగుతల్లి
పాట నింపుగఁ బాడు పరభృతమై యన్న
బల్లవించుఁ దెలుగు పల్లెపాట
వన్నెచిన్నెలఁ దోడ వర్ణమాలను గోరఁ
దీఱైన బంగారు తెలుగు మీటు
నృత్య మంచును బిల్వ నెమలి తానై యాడుఁ
దెలుగు తిన్నెల పైనఁ దెరల నడుమ
తే.గీ. హంసగామిని గగనమ్ము నావరించి
జగతి యెల్లను వెదజల్లు సౌరభములు
భావజాలము వఱలగ భాసురముగ
తెలుగు తల్లికి జేజేలు , వెలుగు జగతి !
( పరభృతము = కోయిల )
జైహింద్. 


Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
చక్కని పద్యమును అందించిన శ్రీ గన్నవరపు సోదరులకు అభినందన మందారములు శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

అజ్ఞాత చెప్పారు...

🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.